Lipstick: మీరు మీ పెదాలను మృదువుగా, సహజంగా గులాబీ రంగులో మార్చుకోవాలనుకుంటే ఇంట్లో తయారుచేసుకునే ఈ లిప్‌స్టిక్ (Lipstick)ను మీ చర్మ సంరక్షణ దినచర్యలో తప్పకుండా చేర్చుకోవాలి. ఒకవేళ మీ పెదాలు నల్లబడటం ప్రారంభించినా కూడా.. ఈ లిప్‌స్టిక్ మీ పెదాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ లిప్‌స్టిక్‌ను తయారు చేయడానికి, ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్న బీట్‌రూట్, కొబ్బరి నూనె, షియా బటర్ అవసరం.
లిప్‌స్టిక్ ఎలా తయారు చేయాలి?
బేస్ తయారీ: ఇంట్లోనే లిప్‌స్టిక్ బేస్‌ను తయారు చేయడానికి కొబ్బరి నూనె, షియా బటర్‌ను డబుల్ బాయిలర్‌లో (నీటి ఆవిరిపై) కొద్దిగా వేడి చేసి బాగా కలపండి. మీరు షియా బటర్‌కు బదులుగా వాసెలిన్‌ను కూడా ఉపయోగించవచ్చు.
బీట్‌రూట్ పేస్ట్: ఇప్పుడు బీట్‌రూట్‌ను ఉపయోగించి చిక్కటి పేస్ట్‌ను తయారు చేయండి.
మిక్సింగ్: చివరగా ఈ బీట్‌రూట్ పేస్ట్‌ను నెమ్మదిగా బేస్‌లో కలపండి. అంతే… మీ లిప్‌స్టిక్ సిద్ధం!
సులభమైన పద్ధతి
- మీరు లేత గులాబీ రంగు లిప్‌స్టిక్ తయారు చేయాలనుకుంటే తక్కువ మొత్తంలో బీట్‌రూట్ పేస్ట్‌ను ఉపయోగించండి.
- అదే మీరు ఎక్కువ మొత్తంలో బీట్‌రూట్ పేస్ట్‌ను ఉపయోగిస్తే ఎరుపు షేడ్ లిప్‌స్టిక్ తయారవుతుంది.
- లిప్‌స్టిక్‌ను సువాసనగా మార్చడానికి మీరు అందులో కొద్దిగా రోజ్ వాటర్ కూడా కలుపుకోవచ్చు.
- ఈ లిప్‌స్టిక్ మిశ్రమాన్ని ఏదైనా చిన్న కంటైనర్‌లో నింపి, కొన్ని గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. తద్వారా లిప్‌స్టిక్ బాగా గట్టిపడుతుంది.
ప్రయోజనాలే ప్రయోజనాలు
- బీట్‌రూట్‌లో ఉండే మూలకాలు మీ పెదాలకు లేత గులాబీ రంగు ఇవ్వడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
- లిప్‌స్టిక్‌లో ఉన్న కొబ్బరి నూనె, షియా బటర్ మీ పెదాలను మృదువుగా ఉంచుతాయి.
- పొడిబారిన పెదాల (Dry Lips) నుండి ఉపశమనం పొందడానికి మీరు ఈ లిప్‌స్టిక్‌ను ఉపయోగించడం ప్రారంభించవచ్చు.
- అంతేకాకుండా ఈ లిప్‌స్టిక్‌ను ఉపయోగించడం ద్వారా మీరు నల్లబడిన పెదాలను సహజంగా గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు.
- అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ లిప్‌స్టిక్ పూర్తిగా సహజమైనది.
