Aadhaar Rule: ఆధార్ కార్డులో (Aadhaar Rule) డిసెంబర్ నెలలో ఒక పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆధార్ కార్డుకు సంబంధించిన సమాచారం దుర్వినియోగం కాకుండా నిరోధించే లక్ష్యంతో యూఐడీఏఐ కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్‌తో మాత్రమే కొత్త ఆధార్ కార్డులను జారీ చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. కొత్త మార్పుల ప్రకారం.. ఆధార్ కార్డుపై ఇకపై పేరు, చిరునామా, 12 అంకెల సంఖ్య కనిపించవు. కార్డుపై కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుంది. ఇందులో మొత్తం సమాచారం సురక్షితంగా దాగి ఉంటుంది.
వార్తా సంస్థ పీటీఐ (PTI) ప్రకారం.. UIDAI సీఈఓ భువనేష్ కుమార్ మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా ఆధార్ కార్డు దుర్వినియోగం పెరిగిందని తెలిపారు. సిమ్ కార్డులు, హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, సొసైటీలు, ఈవెంట్‌లు మొదలైన వాటి నిర్వాహకులు ఆధార్ కార్డును తీసుకుని డేటాను స్టోర్ చేసుకుంటున్నారు. దీనివల్ల డేటా తప్పుడు చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.
న్యూ ఆధార్ కార్డులో ఎలాంటి మార్పులు ఉంటాయి?
UIDAI సీఈఓ భువనేష్ కుమార్ మాట్లాడుతూ.. కొత్త ఆధార్ కార్డులో కేవలం ఫొటో, క్యూఆర్ కోడ్ మాత్రమే కనిపిస్తాయని తద్వారా ఆఫ్‌లైన్ వెరిఫికేషన్స, మాచారం దుర్వినియోగాన్ని నివారించవచ్చని అన్నారు. ఆధార్ నంబర్, పేరు-చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలు ఇకపై కార్డుపై కనిపించవు. దీని వల్ల మీకు సంబంధించిన సమాచారం దుర్వినియోగం కాకుండా రక్షించబడుతుంది. కొత్త నిబంధనలను తీసుకురావాలనే నిర్ణయం డిసెంబర్ 1, 2025 సమావేశంలో తీసుకోబడుతుంది.
UIDAI కొత్త యాప్ లాంచ్ అవుతుంది
కొత్త కార్డులు వచ్చిన తర్వాత UIDAI ఒక కొత్త యాప్‌ను లాంచ్ చేస్తుంది. ఇందులో క్యూఆర్ కోడ్ స్కానింగ్, ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) వంటి సౌకర్యాలు ఉంటాయి. UIDAI సీఈఓ భువనేష్ కుమార్ ఒక బహిరంగ సమావేశంలో ఈ సమాచారాన్ని తెలియజేస్తూ డిసెంబర్‌లో కొత్త నియమాన్ని తీసుకురావాలనే ఆలోచన ఉందని అన్నారు. ప్రజల గోప్యతను కాపాడటానికి అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని, తద్వారా ఆధార్ కార్డు నుండి ఎటువంటి వ్యక్తిగత డేటా లీక్ కాకుండా చూస్తామని ఆయన తెలిపారు.
