Keerthy Suresh: బలగం మూవీతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి తన తదుపరి ఎల్లమ్మ చిత్రం కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. బలగం మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న వేణుకు తన తదుపరి సినిమాకు అన్ని ఆటంకాలే ఎదురవుతున్నాయి. దిల్ రాజు వంటి నిర్మాత ఉన్నా సరే తన రెండో సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండో సినిమా ఎల్లమ్మ కోసం చాలా మంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఎవరూ నటిస్తున్నారనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే ఇప్పుడు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) కూడా ఈ మూవీ నుంచి వైదొలిగినట్లు సమాచారం.
ఇకపోతే వేణు యెల్దండి- దిల్ రాజుల నిర్మాణంలో వస్తున్న గ్రామీణ నేపథ్య చిత్రం ఎల్లమ్మ చుట్టూ ఉన్న గందరగోళం రోజురోజుకు పెరుగుతోంది. మొదటగా ఈ సినిమాలో హీరో పాత్ర కోసం నాని పేరును పరిశీలించారు. కానీ తర్వాత నితిన్ తెరపైకి వచ్చారు. అయితే నితిన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆ తర్వాత సోషల్ మీడియాలో అనేక ఇతర పేర్లు వినిపించాయి. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఇటీవలి నివేదికలు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా ఫైనల్ అయ్యారని వార్తలు వచ్చాయి.
దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ కొత్త అప్డేట్ ఇప్పుడు సినీ అభిమానులను మరింత అయోమయానికి గురి చేసింది. మొదటి నుంచీ కీర్తి సురేష్ కథానాయిక పాత్రకు ప్రధాన అభ్యర్థిగా ఉంటుందని వార్తలు వచ్చాయి. తన కొత్త చిత్రం రివాల్వర్ రీటా ప్రమోషన్లలో భాగంగా తెలంగాణా నేపథ్యంలో సాగే ఈ గ్రామీణ వినోదాత్మక చిత్రంలో తాను భాగం కాదని కీర్తి సురేష్ స్పష్టం చేశారు. కీర్తి సురేష్ కాకపోతే మరి కథానాయిక పాత్రను ఎవరు పోషిస్తారు? బలగం దర్శకుడి తదుపరి చిత్రంలో పురుష ప్రధాన పాత్ర ఎవరు పోషిస్తారు? ఈ సమాధానాల కోసం మరి కొంతకాలం వేచి చూడక తప్పదు.
