Indian Cinema 2025: 2025 సంవత్సరం భారతీయ సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచింది. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ (Indian Cinema 2025) తన అద్భుతమైన ప్రదర్శనతో దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. విడుదలైన గణాంకాల ప్రకారం.. తెలుగు సినిమా వసూళ్ల విషయంలో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచి తన సత్తా చాటింది.
టాలీవుడ్ ప్రదర్శన
తెలుగు నెట్ వసూళ్లు: 2025లో టాలీవుడ్ మొత్తం 261 సినిమాలతో రూ. 1845.77 కోట్లు వసూలు చేసి హిందీ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన పరిశ్రమగా నిలిచింది.
రికార్డు కలెక్షన్లు: అత్యధిక వసూళ్లతో తెలుగు సినిమా పరిశ్రమ తన మార్కెట్ పరిధిని, ప్రేక్షకాదరణను మరింత బలోపేతం చేసుకుంది.
ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు
మొత్తం భారతీయ సినిమా 2025లో రూ. 9734.43 కోట్ల నెట్ వసూళ్లతో భారీ విజయాన్ని నమోదు చేసింది. భాషల వారీగా వసూళ్లు ఇలా ఉన్నాయి.
- (హిందీ): రూ. 3978.01 కోట్లు / 220 సినిమాలు
- (తెలుగు): రూ. 1845.77 కోట్లు / 261 సినిమాలు
- మలయాళం: రూ. 857.74 కోట్లు / 173 సినిమాలు
- ఇంగ్లీష్: రూ. 601.64 కోట్లు / 136 సినిమాలు
- కన్నడ: రూ. 379.34 కోట్లు / 228 సినిమాలు
- మరాఠీ: రూ. 75.77 కోట్లు / 95 సినిమాలు
మొత్తం 1460 సినిమాల ద్వారా రూ. 11450.58 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, 2025 భారతీయ సినిమా చరిత్రలోనే రికార్డు విజయాన్ని నమోదు చేసింది. తెలుగు సినిమా సాధించిన ఈ ఘనత యావత్ సినీ అభిమానులకు గర్వకారణం!
