IPL 2026 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL 2026 Auction) మినీ వేలం గురించి ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం మొత్తం 1355 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ జాబితాలో వెంకటేష్ అయ్యర్, కామెరాన్ గ్రీన్, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా వంటి ఆటగాళ్ల పేర్లు కూడా ఉన్నాయి. ఈసారి మొత్తం 45 మంది ఆటగాళ్లు తమ పేర్లను 2 కోట్ల బేస్ ప్రైస్‌తో నమోదు చేసుకున్నారు.
ఐపీఎల్ 2026 వేలంలో మొత్తం 1355 మంది ఆటగాళ్లు
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం మొత్తం 1,355 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాకు చెందిన అనేక దిగ్గజ ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ గ్రీన్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్ల పేర్లు కూడా ఈ జాబితాలో చేర్చబడ్డాయి. అలాగే జోష్ ఇంగ్లిస్ కూడా తన పేరును నమోదు చేసుకున్నాడు. అయితే అతను పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ఇక, భారత ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్, కేఎస్ భరత్, రవి బిష్ణోయ్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ మావి, నవదీప్ సైనీ, చేతన్ సకారియా, కుల్దీప్ సేన్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, ఉమేష్ యాదవ్ వంటి పేర్లు చర్చలో ఉన్నాయి. వీరిలో కొందరికి పెద్ద బిడ్లు దక్కే అవకాశం ఉంది. కానీ ఇది మినీ వేలం కాబట్టి కొంతమంది ఆటగాళ్లు అమ్ముడుపోకుండా కూడా ఉండవచ్చు.
2 కోట్ల బేస్ ధరలో ఇద్దరు భారతీయులు
ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత్యధిక బేస్ ధర కేటగిరీ అయిన 2 కోట్ల రూపాయలలో కేవలం ఇద్దరు భారత ఆటగాళ్లు రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్ మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మొత్తం 43 మంది విదేశీ ఆటగాళ్లు కూడా ఈ ప్రీమియం బ్రాకెట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
వీరిలో కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, జేమీ స్మిత్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్, సీన్ అబాట్, ఆష్టన్ అగర్, కూపర్ కోనోలీ, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, జోష్ ఇంగిల్స్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, టామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, డేనియల్ లారెన్స్, లియామ్ లివింగ్‌స్టోన్, డారిల్ మిచెల్, రవీంద్ర, మైఖేల్ బ్రేస్‌వెల్, గెరాల్డ్ కోయెట్జీ, లుంగీ ఎన్గిడి, ఎన్రిక్ నోర్ట్జే, మతీశ పతిరానా, మహేశ్ తీక్షణ, వనిందు హసరంగా వంటి పెద్ద పేర్లు ఉన్నాయి.
ఏ జట్టు వద్ద ఎంత పర్స్?
ఐపీఎల్ 2026 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అత్యధిక పర్స్‌తో బరిలోకి దిగనుంది.
- కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): 64.3 కోట్ల రూపాయలు
- చెన్నై సూపర్ కింగ్స్ (CSK): 43.4 కోట్ల రూపాయలు
- సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): 25.5 కోట్ల రూపాయలు
- లక్నో సూపర్ జెయింట్స్ (LSG): 22.95 కోట్ల రూపాయలు
