LPG Price: భారతదేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన LPG ధరలను (LPG Price) మారుస్తాయి. ఇందులో భాగంగా ప్రతి నెల 1వ తేదీ మాదిరిగానే ఈ రోజు కూడా LPG ధరలలో మార్పులు చేశారు. అయితే గృహ వినియోగ LPG ధర తగ్గింపు కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు నిరాశ ఎదురుకావచ్చు. ఎందుకంటే 14 కిలోల గృహ వినియోగ LPG సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.
సంవత్సరంలో చివరి నెల డిసెంబర్ ఈ రోజు నుండి ప్రారంభమైంది. మొదటి రోజునే దేశంలోని కోట్లాది మంది ప్రజలకు శుభవార్త అందింది. ఈ రోజు నుండి 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ (వంట గ్యాస్) ధర తగ్గుతోంది. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం.. 19 కిలోల వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ ధరలో సుమారు రూ. 10 తగ్గింపు జరిగింది. ఈ క్రమంలో డిసెంబర్ 1, 2025 నుండి ఢిల్లీ ,కోల్‌కతాలో LPG ధరలు రూ. 10 చొప్పున తగ్గించబడ్డాయి. ముంబై, చెన్నైలలో మాత్రం రూ. 10.5 చొప్పున ధరలు తగ్గాయి. ఈ తగ్గింపు ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే 14 కిలోల గృహ వినియోగ LPG సిలిండర్ ధరలలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
వాణిజ్య సిలిండర్ కొత్త ధరలు
- ఢిల్లీ- రూ. 1580.50
- కోల్‌కతా- రూ. 1684.00
- ముంబై- రూ. 1531.00
- చెన్నై- రూ. 1739.50
ప్రధాన నగరాల్లో గృహ వినియోగ సిలిండర్ ధరలు
- ఢిల్లీ: రూ. 853.00
- ముంబై: రూ. 852.50
- లక్నో: రూ. 890.50
- వారణాసి: రూ. 916.50
- అహ్మదాబాద్: రూ. 860.00
- హైదరాబాద్: రూ. 905.00
- పాట్నా: రూ. 951.00
