Ram Pothineni: హీరోయిన్‌తో డేటింగ్‌.. స్పందించిన హీరో రామ్‌, ఏమ‌న్నారంటే?!

Ram Pothineni: హీరోయిన్‌తో డేటింగ్‌.. స్పందించిన హీరో రామ్‌, ఏమ‌న్నారంటే?!

Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka) మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. ప్రచార కంటెంట్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ఈ చిత్రం ప్రారంభమైనప్పటి నుండి రామ్- భాగ్యశ్రీల మధ్య ఏదో ‘నడుస్తోంది’ అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ రామ్ పోతినేని స్వయంగా ఈ చిత్రం కోసం గేయ రచయితగా, గాయకుడిగా మారారు. ఇది ఇద్దరి మధ్య నిజంగా ఏదైనా సంబంధం ఉందనే నమ్మకాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో రామ్ ఈ డేటింగ్ పుకార్లపై స్పందించారు.

చాలా ప్రశాంతంగా స్పందించిన రామ్.. తమ ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగా కుదరడం వల్లే ఈ పుకార్లు మొదలయ్యాయని ఆయన వివరణ ఇచ్చారు. మరొక ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ కూడా తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమే అని పేర్కొంది. రామ్ తన తాజా ప్రకటనతో డేటింగ్ పుకార్లకు ముగింపు పలికారు. అయితే ఇటీల‌వ జ‌రిగిన ఈవెంట్‌లో భాగ్య‌శ్రీ రామ్ పోతినేని ప‌లుమార్లు ఇంటి పేరుతో సంభోదించిన స‌మ‌యంలో కూడా వీళ్లిద్ద‌రి మ‌ధ్య డేటింగ్ రూమ‌ర్స్ బాగా ఎక్కువ‌య్యాయి.

ఇక‌పోతే రామ్‌- భాగ్య‌శ్రీ జంట‌గా న‌టించిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఈనెల 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీలో క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర కీల‌క పాత్ర పోషించారు. ఇప్ప‌టికే ఈ మూవీపై టాలీవుడ్‌లో విప‌రీత‌మైన బ‌జ్ క్రియేట్ అయిన విష‌యం తెలిసిందే.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress