TTD: యూఎస్ భక్తుడి నుంచి టీటీడీకి రూ. 9 కోట్ల విరాళం!

TTD: యూఎస్ భక్తుడి నుంచి టీటీడీకి రూ. 9 కోట్ల విరాళం!

TTD: అమెరికాకు చెందిన ఒక భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానంకు (TTD) బుధవారం రూ. 9 కోట్ల విరాళం అందించారని ఆలయ పాలక మండలి ఛైర్మన్ బి.ఆర్. నాయుడు తెలిపారు.పిల్లల కాన్వెంట్ (PAC) -1, PAC-2, PAC-3 భవనాల పునరుద్ధరణ (రెన్నోవేషన్) కోసం ఎం. రామలింగ రాజు ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు.

“టీటీడీకి మరో గొప్ప విరాళం. PAC-1, 2, 3 భవనాల పునరుద్ధరణ కోసం ఎం. రామలింగ రాజు రూ. 9 కోట్లు విరాళంగా ఇచ్చారు” అని టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. రామలింగ రాజు గతంలో 2012లో కూడా రూ. 16 కోట్లు విరాళంగా అందించారని ఆయన తెలిపారు. భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచడానికి చేసిన ఈ కృషికి టీటీడీ తరపున అభినందనలు తెలియజేస్తూ రాజుకు స్వామివారి ఆశీస్సులు లభించాలని చైర్మ‌న్ ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా రాజు నుంచి ఇలాంటి విరాళాలు రావాలని టీటీడీ ఛైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

తిరుమ‌లలో భ‌క్తుల‌కు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో త‌న వంతు స‌హ‌కారం అందించేందుకు ముందుకు వ‌చ్చిన ఆయ‌న‌కు చైర్మ‌న్ అభినంద‌న‌లు తెలిపారు. భ‌విష్య‌త్తులో టీటీడీకి మ‌రిన్ని విరాళాలు అందిస్తార‌ని అశిస్తున్న‌ట్లు తెలియ‌జేశారు. టీటీడీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన హిందూ దేవాలయంగా పరిగణించబడే తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సంరక్షక సంస్థ అని తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య న‌గ‌రం ఎంపీ క‌లిశెట్టి అప్ప‌ల నాయుడు, టీటీడీ అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress