Tamannaah: ప్రస్తుతం స్టార్ హీరోయిన్ తమన్నా (Tamannaah) ఐటమ్ సాంగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నటించిన మిల్కీ బ్యూటీ త్వరలో ఓ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలుగులో ఓదెల 2లో శక్తివంతమైన పాత్రలో, బాలీవుడ్లో అజయ్ దేవగన్ చిత్రం రైడ్ 2లో తన మెరుపు నటనతో కనిపించింది. ఈ నటి చేతిలో అనేక భారీ బడ్జెట్ సినిమాలు నిర్మాణంలోని వివిధ దశల్లో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. తమన్నా ఒక ప్రతిష్టాత్మక బయోపిక్‌లో ప్రధాన నాయిక పాత్రను దక్కించుకుంది.
దివంగత బాలీవుడ్ లెజెండరీ దర్శకుడు వి. శాంతారామ్ జీవిత చరిత్ర ఆధారంగా త్వరలో ప్రారంభం కానున్న బయోపిక్‌లో నటించడానికి తమన్నా అంగీకరించింది. ఈ చిత్రంలో తమన్నా, వి. శాంతారామ్ భార్య అయిన సంధ్య పాత్రను పోషిస్తుంది. కాగా యువ బాలీవుడ్ స్టార్ సిద్ధాంత్ చతుర్వేది వి. శాంతారామ్ పాత్రను పోషించనున్నారు. ఈ సినిమాకు చిత్రపతి వి. శాంతారామ్ అనే టైటిల్ పెట్టారు.
సంధ్య ప్రముఖ హిందీ, మరాఠీ నటి. ఆమె దివంగత శాంతారామ్ దర్శకత్వం వహించిన అనేక చిత్రాలలో నటించారు. చిత్రపతి వి. శాంతారామ్ చిత్రానికి ప్రశంసలు పొందిన నట సామ్రాట్ సినిమా దర్శకుడు అభిజీత్ దేశ్‌పాండే దర్శకత్వం వహించనున్నారు. ఇకపోతే తమన్నా త్వరలోనే చిరు- అనిల్ రావిపూడి మూవీలో ఓ ప్రత్యేక గీతంలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.
